![]() |
![]() |

టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ షోకి ఉన్నంత క్రేజ్ అంత ఇంత కాదు. ఇప్పటికే బిగ్ బాస్ ఆరు సీజన్లు పూర్తి చేసుకొని ఏడవ సీజన్ లోకి అడుగుపెట్టనుంది. సెప్టెంబర్ 3 గ్రాండ్ గా ప్రేక్షకుల ఎంటర్టైన్ చెయ్యడానికి రెడీ అయింది. బిగ్ బాస్ ని ఇష్టపడే అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ జరుగుతుండగా.. ఈ సారి కంటెస్టెంట్స్ గా ఎవరిని తీసుకుంటున్నారన్నది అందరిలో ఉన్న క్వశ్చన్. కాగా గత సీజన్ లో పాపులారిటి లేని కంటెస్టెంట్స్ ని ఎక్కువగా తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దాంతో ఈ సారి జాగ్రత్తగా ఉంటున్నారని, కొత్తగా ఉంటుందనే టాక్ వినబడుతుంది.
బిగ్ బాస్ సీజన్-7 కి సంబంధించిన కంటెస్టెంట్స్ చాలా వరకు ఓకే అయినట్లు సమాచారం. అయితే గత సీజన్ లో కామన్ మ్యాన్ కేటగిరిలో ఆదిరెడ్డిని తీసుకున్నట్లుగా.. ఈ సారి కామన్ మ్యాన్ కేటగిరిలో ఇద్దరికి అవకాశం కల్పిస్తున్నట్లుగా సమాచారం. కాగా గత నెల రోజులుగా సోషల్ మీడియాలో మారుమ్రోగుతున్న పేరు పల్లవి ప్రశాంత్. ఇతను ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చిన రైతు. బిగ్ బాస్ లోకి ఎలాగైనా వెళ్తానంటూ.. మీ సపోర్ట్ కావాలని పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియాలో చెప్తున్నాడు. అలాగే చాలా మందితో ప్రమోషన్ చేస్తూ కనిపిస్తున్నాడు. బిగ్ బాస్ లోకి వెళ్లడం తన కల అంటూ చెప్పుకొచ్చాడు. మరి కామన్ మ్యాన్ కేటగిరీలో ఇతనికి అవకాశం వస్తుందో లేదో చూడాలి. ఇలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ప్రశాంత్ కి పలువురు నెటిజన్లు సపోర్ట్ చేస్తున్నారు.
తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వ్యక్తి పల్లవి ప్రశాంత్.. ఒక ఫార్మర్ గా తన చేసే పనులను వీడియోస్ చేస్తూ పాపులర్ అయ్యాడు. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ లోకి వెళ్ళనున్నట్లు.. ఇన్ స్టాగ్రామ్ లోని పలు బిగ్ బాస్ కి సంబంధించిన పేజీలలో కన్ఫర్మ్ అయినట్టుగా చెప్తున్నారు. మరి వీరు చెప్పే అంచనాలను దాటి మరెవరినైనా తీసుకుంటారా? లేక మోస్ట్ పాపులర్ గా మారిన కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ ని తీసుకుంటారా అనేది ప్రశ్నగా మారింది. అయితే గత కొన్ని రోజులుగా పల్లవి ప్రశాంత్ కి సోషల్ మీడియాలో సపోర్ట్ పెరుగుతూ వస్తుంది. ఎక్కడివెళ్ళిన పల్లవి ప్రశాంత్ ని గుర్తిస్తున్నట్లుగా అతను తన సోషల్ మీడియా అకౌంట్ లలో ఇప్పటికీ వీడియోలుగా చేశాడు. కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ ని బిగ్ బాస్ తీసుకుంటుందా చూడాలి మరి.
![]() |
![]() |